తాలిబన్లకు నిరసన సెగ.. హక్కుల కోసం రోడ్డెక్కిన ఆప్గన్ మహిళలు

-

మహిళల హక్కులపై ఐక్యరాజ్య సమితి, హక్కుల సంఘాలు ఉదాసీనతలో ఉండటంతో సిగ్గు చేటని, ఆప్గన్ లో మహిళల పరిస్థితికి తాలిబన్లతోొ  పాటు ఐక్యరాజ్య సమితి కూడా కారణం అంటూ పెద్ద ఎత్తునా నినాదాలు చేస్తూ మంగళవారం నిరసనలు తెలిపారు. దేశంలో మహిళలు చదువుకోకుండా పాఠశాలలను మూసివేయడంతో కాబూల్ లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం ముందు మహిళలు నిరసన తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షలాది బాలికలు తరగతి గదులకు తిరిగి రావాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని నిరసనకారులు వెల్లడించారు. పనిచేసే హక్కు, విద్యాహక్కు మహిళల ప్రాథమిక హక్కులంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆప్గన్ లో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్లు మహిళలపై నిర్భంధాన్ని విధించారు. దీంతో ఇన్నాళ్లు స్వేచ్ఛను అనుభవించిన మహిళలు ఒక్కసారిగా వంటిళ్లకే పరిమితమయ్యారు. సంప్రదాయాల పేరుతో మహిళలకు స్వేచ్ఛ లేకుండా తాలిబన్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్త్రీ విద్యను వ్యతిరేఖించడంతో పాటు, బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు తోడుండాలనే నిబంధనలు పెట్టారు. తాజాగా మహిళల హక్కులపై తాలిబన్లకు నిరసనలు ఎదురుకావడం మొదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news