దమ్ముంటే చర్చకు రా.. జగన్ కి మంత్రి జనార్దన్ రెడ్డి సవాల్..!

-

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాం లో రోడ్లు అధ్వాన్నంగా మారిన విషయం తెలిసిందే. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయి ఐదేళ్ల పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల దుస్థితిపై దృష్టి
సారించి నిధులు కేటాయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లను అధికారులు మరమ్మతులు
చేస్తున్నారు. అయినా సరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని రోడ్లు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ అసెంబ్లీ సమావేశాల కు రావాలని ఛాలెంజ్ చేశారు. జగన్కు ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి వస్తే మైక్ ఇస్తామని చెప్పారు. ఎవరి తప్పులు ఏంటో అసెంబ్లీలో చర్చిద్దామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news