Deepthi Sunaina: దీప్తితో ష‌న్నుపెళ్లా? దిమ్మ తిరిగే రిప్లే ఇచ్చిన షణ్ముఖ్ తల్లి!

Deepthi Sunaina: బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది. టైటిల్ రేసులో ప్ర‌తి కంటెస్టెంట్ దూసుకపోతున్నారు. నువ్వా నేనా అన్న‌ట్లు.. హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. యూట్యూబ్ స్టార్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన‌ షణ్ముఖ్ జస్వంత్ టాస్క్‌ల పరంగా సరైన పెర్ఫామెన్స్ లేకపోయినప్పటికీ.. తన‌కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో భారీగా సంఖ్య‌లో ఓట్ల‌ను రాబ‌ట్టుకుంటున్నాడు. ఎప్పుడూ టాప్ 5 కంటెస్టెంట్లో ఒక‌డిగా నిలిచి.. టైటిల్ రేసులో దూసుక‌పోతున్నాడు.

అయితే.. సోమ‌వారం జ‌రిగిన నామినేషన్ ప్రక్రియ చాలా ఎమోషనల్‌గా సాగింది. ఈ నామినేష‌న్స్‌లో ష‌న్ను త‌న త‌ల్లి ఉమారాణి గురించి మాట్లాడి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు ష‌న్ను. ‘అమ్మా.. క్యాన్సర్‌తో పోరాడి గెలిచావ్.. అమ్మమ్మ చనిపోతే తట్టుకుని ధైర్యంగా నిలిచావ్.. నువ్వే నా ఇన్పిరేషన్ అమ్మ‌.. అంటూ ఎమోషనల్ అయ్యాడు ష‌న్ను. ఇప్పుడూ ఈ వీడియో కాస్త చ‌ల్ హ‌ల్ అవుతుంది. దీంతో షణ్ముఖ్ తల్లి ఉమారాణి కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

షణ్ముఖ్‌ జస్వంత్‌ ప్రియురాలు దీప్తి సునైనా.. బిగ్‌బాస్‌2 సీజన్‌లో పాల్గొని సందడి చేసింది ఈ అమ్మ‌డు.
వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ్ దీప్తి పేరుని టాటూగా వేయించుకుని.. ప‌దిలంగా దాచుకుంటున్న‌డు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో హోస్ట్ నాగార్జునతో పాటు.. మొన్న ఎలిమినేట్ అయిన ప్రియ కూడా దీప్తి గురించి ప్రస్తావిస్తూ షణ్ముఖ్‌ని ఆటపట్టించారు.

ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా కూడా ప్రత్యేకంగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ కు సంబంధించిన స్పెషల్ వీడియోలను కూడా ఆమె పోస్ట్ చేస్తోంది. దీంతో హౌస్ లో ఎలా ఉన్నా కూడా షణ్ముఖ్ రావాల్సిన ఆదరణను ఎప్పటిలానే అందుకుంటున్నాడు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

ఈ క్ర‌మంలో ఈ ల‌వ్ బ‌ర్డ్స్ వివాహ బంధంతో ఒక్క‌టి కానున్నారంటూ వార్తలు వెలువ‌డుతున్నాయి.
అస‌లు వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హ‌రం వాళ్లు ఇంట్లో తెలుసా… వాళ్ల పేరెంట్స్ కి తెలిస్తే.. ఎలా రియాక్ట్ అవుతారు? అస‌లు ష‌న్ను పేరెంట్స్‌కి సునయను కోడలుగా చేసుకోవడం ఒప్పుకుంటారా? వాళ్ల ఇంట్లో వాళ్ల‌కీ ఇష్టమేనా? అనేది ఆసక్తికరంగా మారింది.


అయితే..ఇదిలా ఉంటే.. షణ్ముఖ్ తల్లి ఉమారాణి.. వారిద్ద‌రి గురించి షాక్ విష‌యాలు వెల్లడించింది. వాళ్లు ఇద్ద‌రూ కేవ‌లం ఫ్రెండ్సేన‌నీ, వాళ్ల‌ది చాలా చిన్న వ‌య‌స్సు ఇప్ప‌డేం తొంద‌ర అని షాకింగ్ కామెంట్స్ చేసింది. వాళ్లు చేసే వీడియోల‌కు మంచి ఆద‌ర‌ణ వ‌చ్చింద‌నీ, చాలా మంది జోడి అంటుంటార‌ని తెలిపింది. ఓ వేళ వాళ్లిద్దరి ఒక్క‌రిని ఒక్క‌రూ ఇష్ట‌ప‌డితే.. అది వాళ్ల ఇష్ట‌మ‌ని.. వాళ్లు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. ఈ విష‌యంలో ఏ రోజు కూడా తాము చ‌ర్చించ‌లేద‌ని.. త‌మ‌ ఫ్యామిలీలు మాట్లాడుకుని వాళ్ల ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తామ‌ని చెప్పుకోచ్చింది.

సిరి, షణ్ముఖ్‌ల మ‌ధ్య వ‌స్తున్న రూమ‌ర్స్ ను ఖండించింది. వాళ్లిద్ద‌రూ ఒకే చోట కలిసి వర్క్ చేశారు కాబట్టి ప్రెండ్లీ గా ఉన్నార‌ని, అందుకే కలిసే గేమ్ ఆడుతున్నారని చెప్పుకొచ్చింది. అయినా ఎవరి గేమ్ వాళ్లది. అది త్వరలోనే తెలుసుకుంటారని స్ప‌ష్టం చేసింది. బిగ్ బాస్‌కి వెళ్లడం ద్వారా షణ్ముఖ్‌కి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. టైటిల్ విన్నర్ అని అంటున్నారు కానీ.. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం కాదా.. గెలుస్తే అంద‌రి కంటే తానే చాలా హ్యాపీగా ఉంట‌న‌నీ తెలిపింది.