కరోనా కొత్త వేరియంట్ ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. ఎన్సీడీసీ ప్రకటన..!

-

రష్యా ..అమెరికా లో కరోనా కొత్త వేరియంట్ ఏవై 4.2 గుబులు రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేరియంట్ ఇప్పటికే మన దేశంలో కూడా ప్రవేశించిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈవేరియంట్ కేసులు మన దేశంలో ఎక్కువ నమోదు అవుతున్నాయని జాతీయ అంటువ్యాధుల నివారణ కేంద్రం (NCDC) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పటి వరకు ఈ రకం కరోనా కేసులు 18 నమోదు అయినట్టు ప్రకటించింది.

అయితే కర్ణాటక మహారాష్ట్ర లోనే ఏ వై 4.2 రకం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి వెల్లడించింది. అంతే కాకుండా తెలంగాణలో జూన్ లో ఒక ఎవై 4.2 వేరియంట్ కేసు నమోదు అయిందని అదేవిధంగా సెప్టెంబర్ …అక్టోబర్ లో మరో రెండు కేసులు నమోదయ్యాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు విచ్చలవిడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మాస్కులు ధరించకపోవడం కరోనా జాగ్రత్తలు పాటించకపోవడంతో మరోసారి ముప్పు తప్పదని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news