జగన్ నా శ్రేయోభిలాషి.. అందుకే కలిశా : నాగార్జున

ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కలిశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను నాగార్జున తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా కలిశారు. దాదాపు గంటపాటు వీరి సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం అక్కినేని నాగార్జున.. సీఎం జగన్ సమావేశం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ రాజధాని రావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ తన శ్రేయోభిలాషి అని పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. సిఎం జగన్ చూసి చాలా రోజులవుతుంది అందువల్ల విజయవాడ వచ్చానని స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. ఇవాళ జగన్ తో సమావేశం అయిన అనంతరం సిఎం తో కలిసి లంచ్ చేశానన్నారు.

ఇక ఈ భేటీ అనంతరం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానం లో హైదరాబాద్ కు బయల్దేరారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. నాగార్జున కు సంబంధించిన వ్యక్తిగత అంశాల పైనే చర్చ జరిగినట్లు సమాచారం అటు సీఎంఓ వర్గాలు కూడా తెలిపాయి. ఈ సమావేశం పూర్తిగా వ్యక్తిగత భేటీ అని పేర్కొన్నాయి సీఎంఓ వర్గాలు.