నోటమాట రాలేదు : చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

-

కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కాసేపటి క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో… గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్… పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. క పునీత్ రాజ్ కుమార్ వృత్తి విషయం తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Megastar Chiranjeevi resign to MAA

పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన విషయం మీద మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ…” ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ కు గురయ్యాను. పునీత్ మరణం రాజ్ కుమార్ కుటుంబానికి తీరని లోటు. చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళిన తనను పునీత్ రాజ్ కుమార్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్కుమార్ హఠాత్ మరణం వార్త తెలియగానే నా నోట మాట కూడా రాలేదు” అంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news