మాఘ సోమవార అభిషేకం చేయండి మంచి జరుగుతుంది ! ఫిబ్రవరి 18 రాశిఫలాలు

-

18th february 2019 Monday horoscope
18th february 2019 Monday horoscope

మేషరాశి: ప్రతికూల ఫలితాలు, ఆకస్మిక ధననష్టం, దుఃఖం, కుటుంబంలో ప్రతికూలత. పరిహారాలు వివాదాలకు దూరంగా ఉండటం, అమ్మవారిని ధ్యానించండం. వీలైతే అన్నదానం చేయండి.

వృషభరాశి: మిశ్రమ ఫలితాలు, కొత్త చుట్టరికాలు, పనుల్లో జాప్యం, కార్యాల్లో విఘ్నాలు. పరిహారాలు దేవీ ఆరాధన/స్తోత్రపఠనం లేదా శ్రవణం, వీలైతే తెల్ల జిల్లేడు పూలతో శివున్ని ఆరాధించండి.

మిధునరాశి: మిశ్రమ ఫలితాలు, అక్కచెల్లలు ఇంటికి రాక, పనుల్లో జాప్యం,శయ్యాభోగం. పరిహారాలు ఈశ్వర ఆరాధన లేదా దేవాలయ దర్శనం చేయండి మంచి జరుగుతుంది 19- మంచి ఫలితాలు, పనులు సాగిపోతాయి, కుటుంబ సఖ్యత, ప్రభుత్వమూలక కార్యజయం, విందులు, స్నేహితులతో లాభం. పరిహారాలు మాఘ పౌర్ణిమ స్నానం ఆచరించండి.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితం, కార్యజయం, ప్రభుత్వ మూలక ధనలాభం, కుటుంబంలో ఇబ్బందులు, పనుల్లో జాప్యం. పరిహారాలు ఈశ్వరునికి తెల్ల జిల్లేడుతో పూజచేయండి. లేదా విష్ణు సహస్రనామాన్ని రెండుసార్లు పఠించండి/శ్రవణం చేయండి.

సింహరాశి: మిశ్రమ ఫలితాలు, పనుల్లో జాప్యం, ఇంట్లో చిన్నచిన్న సమస్యలు, వ్యసనాల వల్ల ఖర్చు. పరిహారాలు ఈశ్వరుని ఆరాధన, భస్మధారణ/మారేడుదళంతో శివున్ని పూజించండి.

కన్యారాశి: మంచి ఫలితాలు, కార్యజయం, ధనలాభం, వాహనలాభం. ఇష్టదేవతారాధన చేసుకోండి చాలు. వీలైతే ఏదో ఒక మంచి పనిచేయండి.

తులారాశి: మంచి ఫలితాలు, శుభకార్య సూచన, కార్యజయం,మనఃశాంతి. పరిహారాలు ఈశ్వర/విష్ణు ఆరాధన చేయండి. గోసేవ చేస్తే మంచిది.

వృశ్చికరాశి: ప్రతికూల ఫలితాలు, కార్యనష్టం, అధికశ్రమ, పనుల్లో జాప్యం. పరిహారాలు శివున్ని తెల్లజిల్లేడు పూలతో లేదా మారేడుతో అర్చించండి. లేదా ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించి ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.

ధనస్సురాశి: ప్రతికూల ఫలితాలు, ప్రయాణ నష్టం, ధననష్టం. పరిహారాలు శివారాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అవకాశం ఉన్నవారు భస్మధారణ చేయండి.

మకరరాశి: అనుకూలమైన ఫలితాలు, బంధువులతో సఖ్యత, సంతోషం, లాభం, ధనలాభం. పరిహారాలు ఇష్టదేవతరాధన, శివపూజ లేదా విష్ణు సహస్రనామ పారాయణం.

కుంభరాశి: మధ్యస్థంగా ఉంటుంది. వ్యవహార నష్టం, అధిక ఖర్చు, మిత్రుల సహకారం. పరిహారాలు మాఘస్నానం, దానం, ధర్మం చేయండి మంచిది.

మీనరాశి: మంచి ఫలితాలు, కీర్తిలాభం, ఇంట్లో చిన్నచిన్న ఇబ్బందులు. పరిహారాలు సోమవార అభిషేకం/భస్మధారణ లేదా చాలీసా పారాయణం చేయండి.

నోట్ – పరిహారాలు ఎక్కువగా పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో సూచించినవి చెపుతున్నాను. ముఖ్యంగా అందరిని అంటే ఆర్థిక, కాల, కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా ఖర్చులేనివి, తప్పక ఫలితాన్ని ఇచ్చేవి రాస్తున్నాను. నమ్మకంతో ఆచరించండి తప్పక ఫలితాలు వస్తాయి. గోచార ఫలితాలు కేవలం 40 శాతం మేర మాత్రనే ప్రభావం చూపిస్తాయి. మీ జన్మనక్షత్రం, సమయం, తేదీ ఆధారంగా పూర్తి ఫలితాలు ఉంటాయి. జన్మనక్షత్రం ఉంటే దాని ఆధారంగా రాశి+ గోచార అంటే మీ పేరుమీద రాశి ఫలితాలను కలిపి చూసుకోండి, పరిహారాలను ఆచరించండి మంచి ఫలితాలను అనుభవించండి. ఓం నమో వేంకటేశాయనమః

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news