వెంకీ మామలో చైతు షాకింగ్ రోల్..!

-

మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడు ముందుండే వెంకటేష్ రీసెంట్ గా ఎఫ్-2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. జై లవ కుశ డైరక్టర్ బాబి డైరక్షన్ లో నాగ చైతన్యతో కలిసి వెంకటేష్ నటిస్తున్న సినిమా వెంకీ మామ. ఈ సినిమాను కోనా వెంకట్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

చైతు నటించిన ప్రేమం సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేశాడు. అయితే మామతో కలిసి ఫుల్ సినిమా చేస్తున్నాడు చైతు. ఇద్దరు కలిసి చేసే హంగమా ఎలా ఉంటుందో చూడాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన ఎఫ్-2 అదరగొట్టగా మామా అల్లుళ్లు చేసే ఈ సినిమా ఇంకెంత ఫన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమా స్క్రిప్ట్ బాగా వచ్చిందట. కోనా వెంకట్ కూడా స్క్రిప్ట్ లో వర్క్ చేశారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news