తెలంగాణలో రీసెంట్ గా హుజురాబాద్ కు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ అభ్యర్థి గెళ్లు శ్రీనివాస్ పై విజయం సాధించారు. అయితే తెలంగాణలో మరో సారి ఎన్నికల హడావిడి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో త్వరలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అంతేకాకుండా శాసనసభకు ఖాళీగా ఉన్న ఆరు స్థానాలకు కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించింది. అసెంబ్లీలో సంఖ్యా బలం ప్రకారం ఆరు స్థానాలను టిఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే మిగతా ఆరు స్థానాలకు మాత్రం పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణలో ఎలక్షన్ హీట్ కనిపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తాకగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ ఏ విధంగా సిద్ధమౌతారు అన్నది ఆసక్తికరంగా మారింది.