ఈటల గెలుపును తమ గెలుపని బీజేపీ సంకలు గుద్దుకుంటోందనీ..ధరలు తగ్గించడానికి ఈటెల రాజేందర్ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత హనుమంతరావు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏం చేస్తారో చెప్పాలని ఫైర్ అయ్యారు. అంబేద్కర్ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడాన్ని నిరసిస్తూ నవెంబర్ 14నుంచి ఊరూరా తిరుగుతానని స్ఫష్టం చేశారు. రైతు బంధును వెంటనే కొనసాగించాలి…బీసీ బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత హనుమంతరావు.
కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి ని పార్టీ కలుపుకుపోవాలని… తాను ఆయనతో మాట్లాడతానన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తో మాట్లాడే బాధ్యత నాకు అప్పగించిందని పేర్కొన్నారు.దళిత బంధు మొదలు పెట్టిన శాలపల్లిలో కూడా కేసీఆర్ కు తక్కువ ఓట్లు వచ్చాయనీ పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా ప్రతిపక్షాల సలహాలు పాటించాలని చురకలు అంటించారు. ప్రగతి భవన్ లో ప్రజలను సీఎం కేసీఆర్ కలవాలన్నారు హనుమంతరావు.