మహేష్, విజయ్.. వాటే క్రేజీ పిక్

-

సూపర్ స్టార్ మహేష్, విజయ్ దేవరకొండ ఒకే చోట కనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ క్రేజీ మీటింగ్ ఎక్కడ అంటే మహేష్ చేస్తున్న మహర్షి సినిమా సెట్ లో అని తెలుస్తుంది. వరుసగా విజయాలతో స్టార్స్ సైతం అవాక్కయ్యేలా చేస్తున్న విజయ్ దేవరకొండ స్టార్స్ అందరిని మెప్పిస్తున్నాడు. గీతా గోవిందం సినిమా గురించి అందరి కన్నా మహేష్ ముందు బాగుందని ట్వీట్ చేశాడు.

అర్జున్ రెడ్డిలో యూత్ ఫాలోవర్స్ ను పెంచుకున్న విజయ్ గీతా గోవిందంతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న విజయ్ తన సినిమా గురించి ట్వీట్ చేసిన మహేష్ కు కృతజ్ఞత చెప్పేందుకు వెళ్లినట్టు ఉన్నాడు. ఆ క్రమంలో దిగిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్, మహేష్ లతో పాటుగా మహర్షి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ పిక్ లో ఉన్నాడు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమాలో మహేష్ కొత్త లుక్ ట్రై చేశాడు. ఈమధ్యనే రిలీజ్ అయిన సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news