ఏపీలో కొత్త పార్టీ స్థాపించిన ఎంపీ

-

అరకు ఎంపీ కొత్తపల్లి గీత  తాను స్థాపించిన కొత్త పార్టీ పేరు ‘జన జాగృతి పార్టీ’ (మార్పుకోసం ముందడుగు)గా  ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో రాజకీయం రెండు కుటుంబాల మధ్యే కొనసాగుతోంది.. మహిళలకు సరైన ఆదరణ లభించడంలేదు. 90 శాతం వరకు ఇతర కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.. రాజకీయంగా మహిళలకు సరైన ప్రోత్సహం లభించడం లేదు అందుకే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో పార్టీ పెడుతున్నా అన్నారు. 20 ఏళ్ల వయస్సులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి చివరిగా  డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించానన్నారు. ప్రజా సేవ చేయాలనే కారణంతో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచానని గుర్తు చేశారు. రాష్ట్రంలో జపాన్, సింగ్ పూర్లను భవిష్యత్ లో నిర్మించుకోవచ్చు..కానీ ప్రస్తుతం  సామాన్య ప్రజలు జీవనం సాగించేలా ప్రభుత్వ పాలన ఉండాలి. అనుభవం గల నాయకుడని ఏపీలో చంద్రబాబుకు పట్టం కడితే ఆయన అరాచకపాలన సాగిస్తున్నారు.. ప్రతిపక్ష పార్టీ హోదాలో వైసీపీ నేత కనీసం అసెంబ్లీకి సైతం వెళ్లక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఏపీలో ఇంకా మంచినీటి సమస్య ఉండటం బాధాకరం. నిష్పక్ష పాతంగా క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పార్టీని ఏర్పాటు చేశాను.. జన జాగృతి పార్టీ మహిళలకు 33 శాతం సీట్లను కేటాయింస్తుందని స్పష్టం చేశారు. ప్రతీ ఆర్నెళ్లకు ఓ సారి ఎమ్మెల్యేలపై సామాజిక ఆడిట్ చేయిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news