రాధేశ్యామ్ అప్డేట్ కావాలంటూ.. ప్రభాస్ ఫ్యాన్ సుసైడ్ నోట్ !

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ హీరోకు లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రభాస్‌ కు ఉంది. అయితే.. ఇటీవల ప్రభాస్‌ నటించిన రాధే శ్యామ్‌ అప్డేట్‌ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. రాధే శ్యామ్‌ ను అప్డేట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభాస్‌ అభిమాని సూసైడ్‌ నోట్‌ రాశాడు.

అంతేకాదు.. ఆ లెటర్‌ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేస్తూ.. నిర్మాణ సంస్థ యూవీ. క్రియేషన్స్‌ ను ట్యాగ్‌ చేశాడు. ప్రస్తుతం ఆ లెటర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ లెటర్‌ రాసింది ఓ రెబల్‌ స్టార్‌ ఫ్యాన్ అయినప్పటికీ… ప్రతి రెబల్ స్టార్‌ ఆవేదన ఇదేనంటూ.. చెప్పుకొచ్చాడు ఆ అభిమాని. ఇంతవరకు ఒక్క లెటర్‌ కూడా రాయని తాను సుసైడ్‌ రాస్తానని అనుకోలేదన్నాడు. తన చావు చూసైనా రాధే శ్యామ్‌ నుంచి అప్డేట్‌ వస్తుందని… కోరుతున్నట్లు ఆ లెటర్‌ లో పేర్కొన్నాడు ఆ అభిమాని. ఇప్పుడు ఈ లెటర్‌ యూవీ క్రియేషన్స్‌ కు పెద్ద తలనొప్పిగా మారింది. కాగా.. జనవరి 14 వ తేదీన రాధేశ్యామ్‌ రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news