కేబీఆర్ పార్క్ కేసులో బిగ్ ట్విస్ట్..నటి చౌరసియాపై లైంగిక దాడి ?

-

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ నిన్న నటి చౌరాసియా పై గుర్తు తెలియని ఓ వ్యక్తి.. దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే నటి చౌరాసియా కేసులో కొత్త కోణం చోటు చేసుకుంది. నటి చౌరాసియా ఫోన్‌ ను లాక్కెళ్లిన కేసు లో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. నటి చౌరాసియా పట్ల అసభ్యం గా ప్రవర్తించాడని గుర్తించారు సిటీ పోలీసులు.

నటి చౌరాసియా కోసం ఆగంతకుడు వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. నటి చౌరాసియా ను పొదల్లోకి తీసుకెళ్లి పెదాలు, మెడపై ఆ సైకో గాయపర్చినట్లు సమాచారం అందుతోంది. బల వంతంగా నటిని పక్కకు లాక్కెళ్లే.. లైంగిక దాడికి ఆ ఆగంతకుడు ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నటి చౌరాసియా పై దాడి చేసింది సైకో గా గుర్తించారు పోలీసులు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. నాలుగు పోలీసు బృందాలతో దుండగుడి కొసం గాలింపు చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు సరిగా  పార్క్ లోని లైట్స్ పని చేయక పోవడంపై ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news