తెలంగాణ రాష్ట్ర పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. ఎకరానికి 52 వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని… పాలేరు నియోజకవర్గం పచ్చగా ఉండాలి,మీరందరూ సంతోషంగా ఉండాలని వెల్లడించారు. పామాయిల్ ఎక్కువగా సాగు చేస్తే పాలేరు లో కూడా పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టిస్తానని కూడా హామీ ఇచ్చారు తుమ్మల.
నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం లో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… రేషన్ కార్డు దారులకు సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. పంటలు నష్ట పోయిన రైతులకు ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుందని వివరించారు. మార్కెట్ ధరలు తగ్గిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని… మద్దులపల్లి మార్కెట్ కు 20 కోట్లు శంక్షన్ చేశామని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మార్కెట్ లు అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.