తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. తిరుమలలోని 01 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకేన్ లేని తిరుమల శ్రీవారి భక్తుల సర్వ దర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. 65, 604 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 24266 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్లుగా నమోదు అయింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టీటీడీ స్పందించింది. ఇకపై లడ్డూ ప్రసాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని భక్తులను కోరింది. తెలిసి తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, సంప్రోక్షణతో పోయాయని వెల్లడించింది. ఇక మీదట స్వచ్చమైన నెయ్యితోనే లడ్డూలు తయారుచేస్తున్నట్లు తెలిపింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ చేస్తున్నామని తెలిపింది.