కెమికల్ క్యాస్ట్రేషన్: బీజగ్రంథులను తొలగించరు! నపుంసకులను చేస్తారు

-

అత్యాచారాలు అలవాటుగా మారిన వారికి కెమికల్ క్యాస్ట్రేషన్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గత ఏడాదే ఆ దేశ అధ్యక్షుడు ఆరీఫ్ ఆల్వీ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆ ఆర్డినెన్స్‌కు ప్రస్తుతం పాకిస్తాన్ పార్లమెంట్ చట్ట రూపం కల్పించింది. ఈ నేపథ్యంలో కెమికల్ క్యాస్ట్రేషన్‌పై చర్చ మొదలైంది.

మానవ శరీరంలోని బీజ గ్రంథులను సెక్స్ గ్రంథులు లేదా పునరుత్పత్తి గ్రంథులు అంటారు. మహిళల్లో అండాలు, పురుషుల్లో వీర్యం పునరుత్పత్తికి కావడానికి ఇవి దోహదపడుతాయి. ఆపరేషన్ ద్వారా పురుషుల్లోని బీజ గ్రంథులను తొలగిస్తే నపుంసకులుగా మారుతారు. అయితే, కెమికల్ క్యాస్ట్రేషన్‌లో ఎలాంటి అవయవాలను తొలగించారు. అలాగే, స్టెరిలైజేషన్ కూడా చేయరు. మందులను ద్వారా సెక్స్‌కు పనికి రాకుండా చేస్తారు. అదే కెమికల్ క్యాస్ట్రేషన్ అంటారు. దీనిని మొదటిసారిగా 1944లో లైంగిక నేరస్తులపై వినియోగించారు.

అత్యాచార దోషులకు కెమికల్ క్యాస్ట్రేషన్ శిక్ష అమలులోకి తీసుకురావడం పాకిస్తాన్‌లోనే తొలిసారి కాదు. ఇప్పటికే దక్షిణ కొరియా, పోలెండ్, చెక్ రిపబ్లిక్‌తోపాటు అమెరికా సంయుక్త కొన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్నది. మన దేశంలో కూడా ఇలాంటి శిక్షలు అమలు చేయాలని డిమాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా 2012లో నిర్భయ సంఘటన జరిగినప్పుడు కెమికల్ క్యాస్ట్రేషన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news