బ్రేకింగ్ : వైసీపీలో విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్సీ మృతి..

కృష్ణా జిల్లా వైయస్సార్ సిపి పార్టీ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఆ పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ కరిమున్నిసా గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి అస్వస్థతకు గురవడం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె నిన్నరాత్రి తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయమే అసెంబ్లీ సమావేశాలు కూడా కరి మున్నీసా హాజరు అయ్యారు.

కరి మున్నీసా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి… పార్టీ స్థాపించిన రోజు నుంచి క్రియాశీలకంగా వ్యవహరించారు కరి మున్నీసా. గత ఏడాది ఆమెకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి…  సరైన గౌరవం ఇచ్చారు సీఎం జగన్‌.  తాజాగా ఆమె మృతితో కృష్ణా జిల్లా వైసీపీ పార్టీ లోకి వెళ్ళింది.  ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, బందువులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు.