చిత్రావది నదికి పెరిగిన వరద ఉదృతి…భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు..!

-

చిత్రావది నదికి వరద ఉదృతి పెరిగిపోతోంది. లింగాల మండలం పార్నపల్లె సమీపంలోని చిత్రావతి జలాశయం ఏడు గేట్లను ఎత్తివేశారు. చిత్రావతి నీటికి తోడు పరివాహాక ప్రాంత వర్షాలతో…గండికోట, మైలవరం జలాశయాలకు వరదనీరు పోటెత్తుతోంది. గండి కోట నుంచి మైలవరానికి లక్షన్నర క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మైలవరం నుంచి పెన్నా నదికి లక్షన్నర క్యూసెక్కులు  విడుదల చేశారు. కుందునదిలోనూ భారీగా వరద నీటి ప్రవాహాం చేరింది. మొత్తంగా పెన్నాకు 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీటి ప్ర‌వాహం వ‌చ్చి చేరుతోంది.

దాని ప్ర‌భావంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, ఖాజీపేట,  చెన్నూరు మండలాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సిబ్బంధి పునరావాస కేంద్రాలకు త‌ర‌లిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ద‌ల ఉధృతి నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఈరోజు ముంపు గ్రామాల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. మొద‌ట గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్క‌డ నుండి సీఎం ముంపు గ్రామాల్లో పర్య‌టిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news