నీట్ కౌన్సెలింగ్‌పై ఎంసీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు… ఈ విషయంలో జాగ్రత్త…!

-

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 కౌన్సెలింగ్ ని స్టార్ట్ చేయనుంది. నీట్ 2021లో ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ కోసం జరిగే కౌన్సలింగ్ గురించి చూస్తున్నారు. అయితే ఈ కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. అయితే అభ్య‌ర్థుల కోసం ప‌లు స‌ల‌హాల‌ను ఎంసీసీ చెప్పింది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కౌన్సెలింగ్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ కోసం ఏజెంట్‌ ని నియమించుకోకుండా అభ్య‌ర్థులే స్వ‌యంగా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తి చేసుకోవాల‌ని అంది. కౌన్సెలింగ్ ప్రారంభించే ముందు, కమిటీ, వెబ్‌సైట్‌ కి సంబంధించి పూర్తి సమాచారం ఇస్తుందని చెప్పింది. అదే విధంగా మోస‌పూరిత వెబ్‌సైట్‌లు ఉంటే ఎంసీసీ చెబుతుంది అని అంది.

ఇలాంటివి ఉంటే ఎవ‌రైన ఎంసీసీ దృష్టికి తీసుకొస్తే త‌ప్పుడు వెబ్‌సైట్ నిర్వ‌హ‌కుల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తామ‌ని చెప్పింది. MCC ద్వారా సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు MCC వెబ్‌సైట్ నుండి లెటర్ ని డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు అడ్మిషన్ కోసం కేటాయించిన కళాశాలలలో నివేదించాలి.

ఇది ఇలా ఉంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులు NEET 2021 క్లియర్ చేయడానికి కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. SC, STకి చెందిన వారు 40 పర్సంటైల్ మరియు PwD అభ్యర్థులు 45 పర్సంటైల్ సాధించాల‌ని ఎంసీసీ అంది. NEET కౌన్సెలింగ్ 2021కు నీట్ 2021 అడ్మిట్ కార్డులు,
NEET 2021 ఫలితాలు లేదా ర్యాంక్ కార్డు, 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, క్లాస్ 12 పాస్ సర్టిఫికేట్ అవసరం అవుతాయి. అలానే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ID, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, కుల ధ్రువీకరణ పత్రం కూడా అవసరం.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news