దేశానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ – డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క విదేశీ పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారం రోజులపాటు అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న ఆయన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న మధ్యాహ్నం జపాన్ కి చేరుకున్నారు. ఇక నేడు రాజధాని టోక్యో నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.

అక్కడి అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రత్యేకంగా పరిశీలించారు బట్టి విక్రమార్క. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియలు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంలు, ఇతర పునరుత్పాదక ఇంధన సాంకేతికతలపై కేంద్రంలోని శాస్త్రవేత్తలు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ మారనుందని హర్షం వ్యక్తం చేశారు.

గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని స్థాపించడానికి జపాన్ కి చెందిన యమనాసి కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకార ప్రయత్నంతో తెలంగాణ హరిత భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో పుష్కలమైన నీటి వనరులు, సోలార్ ప్లాంట్లకు అణువైన ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news