హిందూమత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడది నాలుగు సార్లు నవరాత్రులు జరుపుకుంటారు. ఇందులో శారదీయ చైత్ర నవరాత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. అక్టోబర్ 12వ తేదీ వరకు ఉంటాయి. నవరాత్రుల్లో మొదటి రోజున శని దేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతకు తొమ్మిది రోజులు తొమ్మిది ప్రత్యేక రూపాయల అలంకరించి పూజలు చేస్తారు. అయితే నవరాత్రి వేళ దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే ఎలాంటి వాటిని ఆచరించాలి అనేది చూద్దాం.
ఈ సమయంలో ప్రతి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి. 9 రోజులు 9 రూపాలలో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం.. నవరాత్రుల సమయంలో దశమి తిధి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించడం అలా సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఇవ్వడం మంచిది.
నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పాటు ఉపవాసానికి ప్రత్యేకత ఉంది తొమ్మిది రోజులు ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయాలి. దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్క పీటపై ప్రతిష్టించాలి. అమ్మవారి విగ్రహం ఎడమవైపున వినాయకుని విగ్రహం ఉంచాలి. శరన్నవరాత్రుల ప్రతిరోజు దుర్గా చాలీసా దుర్గా సప్తశతి పఠించాలి. నవరాత్రుల పూజల్లో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వుల్ని సమర్పిస్తే మంచిది. నవరాత్రులు వేళ ఉపవాసం ఉండే వాళ్ళు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయాల్లో పాలు, పండ్లు తీసుకోవచ్చు