రాజ్యసభలో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాగు చట్టాల రద్దు బిల్లు పై చర్చకు విపక్షాలు పట్టు బట్టాయి. అయితే.. దీనికి అధికార పార్టీ, అలాగే… రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడు నిరాకరించడంతో… ప్ల కార్డులతో ఎంపీలు నిరసన తెలిపారు. దీంతో విసుగు చెందిన రాజ్య సభ చైర్మన్… ఏకంగా… రాజ్య సభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెన్షన్ చేశారు. సస్ఫెన్షన్ చేయడమే కాకుండా… రాజ్య సభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు.
సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో ఎలమరం కరీం – సీపీఎం, ఫూలో దేవి నేతమ్, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ – INC, బినోయ్ విశ్వం – CPI, డోలా సేన్ & శాంత ఛెత్రి – TMC, ప్రియాంక చతుర్వేది & అనిల్ దేశాయ్ – శివసేన ఉన్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభం కానుంది.