కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదు…టీఆర్ఎస్ పార్టీ బాధ పార్లమెంట్ కు చేరింది.- కిషన్ రెడ్డి.

-

కేసీఆర్ మొండి వైఖరి వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ లో ఓటమి అనంతరం నుంచి కేసీఆర్ కు నిద్రపట్టడం లేదని..హుజూరాబాద్ ఫలితాల బాధ ప్రగతి భవన్ కే కాదు.. పార్లమెంట్ కు చేరుకుందని… మీ ఓటమికి సానుభూతి తెలపడం తప్పితే మేం ఏమీ చేయలేమని ఆయన ఎద్దేవా చేశారు. పంటల ప్రణాళికను టీఆర్ఎస్ అమలు చేయడం లేదని, కేవలం కేసీఆర్ ప్రణాళిక మాత్రమే ఉందని విమర్శించారు. పంటల సాగు పై ప్రభుత్వానికే స్థిరమైన, స్పష్టమైన అవగాహన లేదని కిషన్ రెడ్డి అన్నారు.

ధాన్యం కొనుగోలును అనేక సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లే కేంద్రం ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తామన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని గతంలో తెలంగాణ ప్రభుత్వమే అగ్రిమెంట్ చేసుకుంది. నాలుగేళ్లుగా రాస్ట్రాన్ని బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్రం హెచ్చరిస్తూనే ఉందని.. ’రా‘ రైస్ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఆయన ప్రశ్నించారు. ఈ సంవత్సరం మేం ధాన్యం కొనుగోలు చేయమనే విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. పుత్ర వాత్సల్యంతో రైతుల్ని గందరగోళానికి గురిచేయెద్దని అన్నారు. హుజూరాబాద్ తీర్పుతో కొడుకు ముఖ్యమంత్రి అవుతాడో లేదో అని భయం పట్టుకుందని కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని భయపెట్టేలా చేస్తుందని.. రైతులు ఆలోచించాలని.. కిషన్ రెడ్డి అన్నారు. చివరి బస్తా వరకు ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని మరోసారి స్ఫష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news