వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల పై రైతులు దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వేరు శనక, మినుము, పత్తి, పెసర్లు, శనగలు వంటి పంటలు వేయాలని రైతులకు సీఎం కేసీఆర్ సూచించాడు. అంతే కాకుండా మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంట ల వైపు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి ని ఆదేశించాడు.
అయితే సీఎం కేసీఆర్ రోడ్డు ద్వారా హైదరాబాద్ వెళ్తుండగా.. వనపర్తి జిల్లా లోని పెబ్బేరు మండలంలో పలు గ్రామాల రైతుల తో మాట్లాడారు. అలాగే ఒక గ్రామం లో సాగు చేసిన వేరు శనగ, మినుము పంటలను పరిశీలించారు. అలాగే రైతు లతో పలు పంటల గురించి చర్చించారు. అలాగే మార్కెట్ లో ఆయా పంటల ధరల ను రైతులకు వివరించాడు.
మినుములు ధర ఎంఎస్పీ ధర క్వింటాల్ కు రూ. 6300 ఉందని అన్నారు. కానీ మార్కెట్ లో రూ. 8 వేలకు పై గానే ఉందని తెలిపారు. అలాగే వేరు శనగ ఎంఎస్పీ ధర రూ. 5550 ఉందని అన్నారు. కానీ మార్కెట్ లో రూ. 7 వేలకు పైగా ఉందని వివరించారు.