ఆడబిడ్డల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళా భద్రతకు హైదరాబాద్ యువకులు రూపొందించిన ’అభయ్ కోట్‘ సెఫ్టీ జాకెట్ ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించింది. రాష్ట్రంలో మహళా భద్రత సీఎంకేసీఆర్ ప్రధాన ఎజెండా అని కవిత అన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం షీటీమ్ లను ఏర్పాటు చేసిందని అన్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఉక్కు పాదాలు మోపుతుందని ఆమె అన్నారు. దివ్యాంగుల రక్షణ కోసం ప్రత్యేక పరికరాలు రూపొందించిన యువకులను కవిత అభినందించారు. వీరు రూపొందించిన ప్రత్యేక కోట్ వినికిడి, మాట్లాడటం సమస్యలు ఉన్న మహిళలకు కూడా ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఎలాంటి సమయంలో అయినా ప్యానిక్ బటన్ నొక్కడంతో సైరన్ తోపాటు, కరెంట్ షాక్ రావడం కోట్ యెక్క ప్రత్యేకత అని ఆమె తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళల ఆత్మరక్షణకు ఇతరులను అప్రమత్తం చేయడానికి ఈ ప్రత్యేక జాకెట్ ఎంతో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు, సమీప పోలీస్ స్టేషన్లకు మెసేజ్ వెళ్లేలా.. జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశారని కవిత అన్నారు.
మహిళా భద్రతకు ’ అభయ్ కోట్‘ … ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత.
-