ప్రధాని మోదీకి కేటీఆర్ ట్విట్.. తెలంగాణ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి

తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురుపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్ చేశారు. తెలంగాణలోని ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించాలని ట్విట్ లో ప్రధాని మోదీని కోరారు.

పోలవరం, ఎగువ భద్ర ప్రాజెక్ట్ లకు ఇచ్చిన ప్రాధాన్యత కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ అనేక సార్లు కోరారని కేటీఆర్ గుర్తు చేశారు. ఈనెల 6న జరగనున్న సమావేశంలో తెలంగాణ ప్రాజెక్ట్ లపై చర్చించేలా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఆదేశించాలని ప్రధాని మోదీని కేటీఆర్ కోరారు.

గతంలో చాలా రోజుల నుంచి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. తాజాగా కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్ ద్వారా మరోసారి ప్రధాని ద్రుష్టికి తీసుకెళ్లారు.