ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువులు బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్.. ప్రపంచంలో ఏ వస్తువుకు అంత డిమాండ్ లేదు. బంగారాన్ని కొనేందుకు.. చాలా మంది… మహిళలు క్యూ కడతారు. ఇక మన దేశంలో.. బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధర ఎంత పెరిగినప్పటికీ మహిళలు బంగారాన్ని కొనేందుకు.. ఆసక్తి చూపుతారు. అయితే ప్రస్తుతం మన దేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరల వివరాల్లోకి వెళితే..
హై దరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 300 వరకు పెరిగి.. రూ. 44, 750 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 330 వరకు పెరిగి… 48, 820 కి చేరుకుంది. బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు కూడా కాస్త పెరిగి పోయాయి. కిలో వెండి ధర ఏకంగా… రూ. 200 పెరిగి పోయి.. 65, 500 లకు చేరుకుంది. బంగారం మరో రెండు రోజుల్లో ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ నిపుణులు చెబుతున్నారు.