ధోనితో బ్రేక‌ప్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ల‌క్ష్మిరాయ్

-

ధోని తో బ్రేక‌ప్ అయిన త‌ర్వాత హీరోయిన్ ల‌క్ష్మిరాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ధోని తో త‌న‌కు ఉన్న సంబంధం ఓ మ‌చ్చ‌లా మిగిలిపోతుంద‌ని ల‌క్ష్మిరాయ్ అన్నారు. అలాగే ఈ మ‌చ్చ కొన్నేళ్ల వ‌ర‌కు ఉంటుంద‌ని.. అది మాయం అవ‌ద‌ని అన్నారు. కాగ తాము విడిపోయి ఏళ్లు గ‌డుస్తున్నా.. ఇప్ప‌టి కి కూడా అంద‌రూ చర్చించుకోవ‌డం ఆశ్చ‌ర్యం గా ఉంద‌ని హీరోయిన్ ల‌క్ష్మీరాయ్ అన్నారు. కాగ మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని తో హీరోయిన్ ల‌క్ష్మీరాయ్ చాలా రోజులు డేటింగ్ లో ఉన్నారు.

గ‌తం లో ఈ వార్త ప్ర‌తి సోషల్ మీడియా లో, టీవీ లో త‌ర‌చూ వ‌చ్చేది. ఈ జంట ఎక్క‌డైన మీడియా కు క‌న‌ప‌డితే.. రెండు మూడు రోజుల షోలు చేసేవారు. ఐపీఎల్ స‌మ‌యం లో కూడా ఈ జంట నైట్ పార్టీ ల‌కు వెళ్లే వారు. అలాగే ఒక సారి సురేష్ రైనా పుట్టిన రోజు వేడుక‌ల కు కూడా ధోని, ల‌క్ష్మీరాయ్ హాజ‌రై అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రియారు. అయితే వీరి బంధం తెగి పోవ‌డం తో సాక్షి అనే స్నేహితురాల‌ని ధోని వివాహం చేసుకున్నాడు. వీరికి జీవా అనే కూతురు కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news