ఆదివారం రోజు రాజస్థాన్ లోని జైపూర్ లో ఒకే కుటుంబం లో తొమ్మిది ఓమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. అయితే ఈ తొమ్మిది మంది ఓమిక్రాన్ రోగులను అధికారులు ట్రెస్ చేశారు. వీరు ఇప్పటి వరకు ఎంత మంది ని కలిసారు అనే దాని పై విచారణ చేస్తున్నారు. దీని లో అధికారులు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. ఈ తొమ్మిది మంది లో నలుగురు సౌత్ ఆఫ్రిక నుంచి నవంబర్ 25న వచ్చారు. ఈ నలుగురికి మాత్రమే ఓమిక్రాన్ వేరియంట్ సోకింది.
అయితే వీరు నవంబర్ 28న ఒక్క పెళ్లి వేడుక లో పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఆ కుటుంబం నుంచి ఒకతను టెస్ట్ చేసుకోగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. అదే ఓమిక్రాన్ గా తెలిసింది. ఆ కుటుంబం మొత్తం టెస్టులు చేయగా.. మొత్తం 9 మంది కి ఓమిక్రాన్ అని తెలింది. అయితే ఈ పెళ్లి వేడుక కు దాదాపు 100 మంది కి పై గా వచ్చారని అధికారులు తెలుసుకున్నారు. ప్రస్తుతం అందులో 34 మంది శాంపుల్స్ ను పరీక్షించారు. మిగిలిన వారి కి కూడా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంది.