ఇండియాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య సగటున 10 వేలకు మించడం లేదు. ఇతర ప్రపంచ దేశాలైన యూరోపియన్ దేశాలు, రష్యాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అక్కడ రోజుకు సగటున 30 వేల కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్న ఇండియా లాంటి దేశంలో రోజుకు 10 వేల లోపు కేసులు నమోదవ్వడం శుభసూచికం.
ఇండియాలో గత 24 గంటల్లో 8306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 98416 గా ఉంది. గత 552 రోజుల్లో పోలిస్తే ఇదే అతి తక్కువ యాక్టివ్ కేసుల సంఖ్య. గడిచిన 24 గంటల్లో 8834 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇండియాలో ఇప్పటికే 50 శాతం మంది అర్హులైన వయోజనులందరికి రెండు డోసుల టీకా అందింది. దీంతో ప్రజల కోవిడ్ బారిన పడటం కూడా తక్కువైంది.
ఇండియాలో కేసుల వివరాలు
మొత్తం కరోనా కేసులు– 3,46,41,406
మరణాలు– 4,73,326
యాక్టివ్ కేసులు– 98416
రికవరీ– 3,40,60,774