ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా ఉద్యోగాలని భర్తీ చేయడానికి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దీనిలో మొత్తం 146 ఇంజనీర్ పోస్టులు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఎంపికైన అభ్యర్థులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక ఎవరు ఈ ఖాళీలకు అప్లై చేసుకోచ్చు అనేది చూస్తే.. కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేష్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.45 లక్షల వేతనం ఉంటుంది.. దరఖాస్తుకు డిసెంబర్ 9ని ఆఖరి తేదీ. అభ్యర్థులకు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోచ్చు అనేది చూస్తే..

అభ్యర్థులు ముందు https://www.oil-india.com/Current_openNew.aspx ను ఓపెన్ చేయాలి.
Apply Online పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ ‘Register Now’ పై క్లిక్ చేయాలి.
పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
ఇలా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ను నింపాలి. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.200 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news