తెలంగాణ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..ఉద్యోగుల పునర్విభజన మార్గదర్శకాలు విడుదల

-

తెలంగాణ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది కేసీఆర్ స‌ర్కార్‌. కొత్త రాష్ట్ర పతి ఉత్తర్వుల మేరకు ఉద్యోగుల పునర్విభజన మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. సీనియారిటీ ప్రకారమే ఉద్యోగుల కేటాయింపులు జ‌రిగేలా… సాంక్షన్ పోస్ట్స్ ఆధారంగా వర్కింగ్ స్ట్రెన్త్ కొత్త జిల్లాల కు కేటాయింపులు జ‌రిగేలా మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల అయ్యాయి. వర్కింగ్ స్ట్రెన్త్ నిష్పత్తి ప్రకారమే ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల కేటాయింపు జ‌రిగే ప్ర‌భుత్వం నిర్న‌యం తీసుకుంది. జిలా క్యాడర్ పోస్ట్ ల అలకేషన్ కి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసిన స‌ర్కార్‌.. జోనల్, మల్టీ జోనల్ పోస్ట్ ల అలకేషన్ కి సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి, సంబంధిత శాఖ ల కార్యదర్శులు, hod ల తో కమిటీ వేసింది.

kcr
kcr

ఉద్యోగుల అలకేషన్ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారు, వితంతువు, మెంటల్ల్లి ఛాలెంజ్ పిల్లలు ఉన్న ఉద్యోగి కి ప్రాధాన్యత ఇవ్వ‌నుంది. సీనియారిటీ ప్రకారం ఆయా విభాగాధిపతులు జాబితా తయారు చేసి కొత్త లోకల్ క్యాడర్ వారిగా కేటాయించాలి.. కేటాయింపు సందర్భంగా ఏ ఒక్క ఉద్యోగి మిస్ కావొద్దని తెలిపింది. భార్య భర్తల కేసులు ఉంటే ఉద్యోగుల కేటాయింపు పూర్తి అయిన తర్వాతనే వాటి పరిష్కారం జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కార్‌. పరిపాలన అవసరాల దృష్ట్యా ఏ ఉద్యోగిని ఎక్కడ అయిన నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.. జిల్లా క్యాడర్ పోస్ట్ లకు కలెక్టర్ కి, జోనల్ పోస్ట్ లకు సంబంధిత hod కి, మల్టీ జోనల్ పోస్ట్ లకు సంబంధిత శాఖ కార్యదర్శి కు దరఖాస్తు చేసుకోవాలని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్‌…

Read more RELATED
Recommended to you

Latest news