తెలంగాణలో పెరిగిన ఇంటర్ అడ్మిషన్స్.. 5 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి

-

తెలంగాణరాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్స్ సంఖ్య పెరిగింది. ఇవాలే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువు ముగిసింది. ప్రభుత్వ జూనియర్ కాలేజి ల్లో ఇంటర్ మొదటి సంవత్సరం లో రికార్డ్ స్థాయిలో అడ్మిషన్స్ నమోదు అయ్యాయి. గత 5 ఏళ్ల తో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా చేరికలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. లక్షా 55 వేల 408 సీట్లు ఉంటే లక్షా 10 వేల 686 సీట్లు భర్తీ అయ్యాయని పేర్కొన్నారు అధికారులు. దీంతో అడ్మిషన్స్ సంఖ్య లక్ష దాటింది.

ఇలా లక్ష దాటడం కూడా ఇదే మొదటి సారి. అన్ని కాలేజి ల్లో(ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్) కలిపి ఇంటర్ మొదటి సంవత్సరం లో సుమారు 5 లక్షల అడ్మిషన్స్ జరిగాయి. బోధన బోధనేతర సిబ్బందికి కి 96 శాతం పైగా వాక్సినేషన్ పూర్తి అయిందని అధికారులు తెలిపారు. ఇంటర్ లో 18 సంవత్సరాల కు పై బడిన విద్యార్థులకు వాక్సినేషన్ ఏర్పాట్లు చేశారు. ఇంటర్ లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థుల సంఖ్య 55 వేలు గా ఉంది. కరోనా రూల్స్ పాటిస్తూ.. కాలేజీలు నడుపుతున్నారు అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news