ముషీరాబాద్ వాటర్ ట్యాంక్ లో డెడ్ బాడీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే డెడ్ బాడీ ఎవరిది అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇది హత్యే అని పోలీసులు అనుమానిస్తున్నారు. వాటర్ ట్యాంక్ పై చెప్పులు లభ్యం లభ్యం అయ్యాయి. వాటర్ ట్యాంక్ పై లభ్యమైన చెప్పుల ఆధారంగా పోలీసుల విచారణ వేగవంతం అయ్యింది. ట్యాంక్ లో డెడ్ బాడీ లభ్యం అయినపుడు ట్యాంక్ మూతలు మూసి ఉన్నాయి. దాంతో ఎవరైనా ఆ వ్యక్తిని చంపి అందులో పడేసి మూత పెట్టినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు ముందు ట్యాంక్ పై మద్యం తాగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయి ఉండటంతో గుర్తించడం కష్టంగా మారింది. అయితే గత 15 రోజుల క్రితం నల్లకుంట పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. దాంతో ఆ డెడ్ బాడీ మిస్ అయిన యువకుడిదా కాదా అన్నదానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్యాంక్ ను క్లిన్ చేసేందుకు వెళ్లిన జలమండలి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటివరకు ట్యాంక్ వాటర్ నే స్థానికులు తాగినట్టు చెబుతున్నారు. ఆయాసం, గొంతులో ఇబ్బంది, చిన్నపిల్లల్లో అనారోగ్య సమస్యలు వెలుగుచూస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. వెంటనే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షలు చేయాలని కోరుతున్నారు.