కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆర్మీ ఛీఫ్ జనరల్ బిపిన్ రావత్ పటం వద్ద నివాళులు అర్పించారు కేంద్ర రక్షణ శాఖ మాజీ సహయ మంత్రి ఎం.ఎం.పల్లం రాజు. ఈ సందర్భంగా ఎం.ఎం. పల్లంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం చాలా క్రిటికల్ జంక్షన్ లో ఉందని…ఇప్పటి వరకు మనకు ప్రత్యర్ధి పాకిస్ధాన్ ను సరిహద్దులో ఎదుర్కోంటు వచ్చామని పేర్కొన్నారు. గత రెండేళ్ళ గా చైనా మన సరిహద్దులో తన ఆధిపత్యం కోసం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ పాగా వేసిందని ఫైర్ అయ్యారు.
సరిహద్దు సమస్య పరిష్కారం కానంత వరకు చైనా మనకు ఒక మేజర్ త్రెట్ గానే ఉంటుందని.. చైనా తో మనం సరిగ్గా హ్యండిల్ చేయకపోవడం వల్ల వారొచ్చి మన సరిహద్దులో కూర్చున్నారు..ఇక అక్కడ నుండి వారు కదిలే పరిస్ధితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో జనరల్ బిపిన్ రావత్ కోల్పోవడం దేశానికి దురదృష్టకరమని వెల్లడించారు.సిలిగురి జంక్షన్ ఛైనా ఆక్రమించకుండా బిపి రావత్ తీసుకున్న చర్యలు…ఆయనేంటో నిరూపించాయని తెలిపారు. ఆర్మీ,ఎయిర్ ఫోర్సు,నేవీలను ఒక సమన్వయంతో ముందుకు నడిపించారని.. రక్షణ శాఖ ఆయుధాలను పెంపొందించేందుకు…వాటిని స్వదేశంలోనే తయారు చేయ్యాలని ఆకాంక్షించారని వెల్లడించారు.