ఆన్‌లైన్ టికెట్, బెన్‌ఫిట్ షో వివాదానికి త్వ‌ర‌లోనే ప‌రిష్కారం- న‌టుడు ఆలీ

-

ఆన్‌లైన్ టికెట్, బెన్‌ఫిట్ షో వివాదానికి త్వ‌ర‌లోనే ప‌రిష్కారం లభిస్తుందని న‌టుడు, వైసీపీ నేత ఆలీ అన్నారు. కె.ఎల్.యు. యూనివర్సిటీ.. నటుడు ఆలీకి డాక్టరేట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆన్‌లైన్ టికెట్, బెన్‌ఫిట్ షో వివాదం పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కె.ఎల్.యు. యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.

సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందని వెల్లడించారు. సిఎం జగన్.. మంత్రి పదవి వస్తే మరింత ఆనందం అని పేర్కొన్నారు. సినిమా రంగానికి సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్లు విధానం, బెనెఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని.. హామీ కూడా ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా అద్భుతంగా ఉందని.. ఆయన అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చారని కొనియాడారు ఆలీ. ఏపీ ప్రజలకు అన్నీ రకాల జగన్ సర్కార్ ఉపయోగ పడుతుందని చెప్పారు అలీ.

Read more RELATED
Recommended to you

Latest news