అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నెమ్మదిగా పాతబడిపోతోంది. తాత్కాలిక మరమ్మతులతో ఐఎస్ఎస్ య జీవితకాలాన్ని పొడిగించగలిగాయి. కానీ దానిని ఉపసంహరించుకునే సమయం త్వరలోనే రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొత్తగా మరో స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి మూడు ప్రైవేటు సంస్థలతో టైఆప్ కానుంది. దీనికి సంబంధించి బడ్జెట్ ను కూడా అంచాన వేసింది. 415.6 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని అంచానా. మూడు కంపెనీలు బ్లూ ఆరిజిన్ (130 మిలియన్లు డాలర్లను), నానోరాక్స్ (160 మిలియన్లుడాలర్లను), నార్త్‌రోప్ గ్రుమ్మన్ (125.6 మిలియన్లుడాలర్లను) పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు. నాసా రెండు దశల్లో కొత్తగా స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. లో ఎర్త్ ఆర్బిట్ లో ఈ కొత్త స్పేస్ స్టేషన్ ను నిర్మించనున్నారు. 1980 దశకంలో మిర్ అంతరిక్ష కేంద్రం కూలిపోయిన తర్వాత ఐఎస్ఎస్ ఆలోచన వచ్చింది. 2000 సంవత్సరంలో ఐఎస్ఎస్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 21 ఏళ్ల నుంచి ఐఎస్ఎస్ తన సేవలను అందిస్తోంది.