విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరణ చేయ‌దు : నాదెండ్ల హాట్ కామెంట్స్‌

-

విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి మేం తీసుకెళ్లామ‌ని… అమిత్ షాతో పాటు.. బీజేపీతో జరిపే అనేక సమావేశాల్లో ప్రైవేటీకరణ చేయొద్దనే విషయాన్ని పవన్ స్వయంగా కోరార‌ని వెల్ల‌డించారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రైవేటీకరణ చేయద‌ని… జనసేన బలంగా నమ్ముతోందన్నారు. మోడీ నాయకత్వాన్ని నమ్ముతున్నాం.. చక్కగా దేశాన్ని పాలిస్తున్నారని.. రైతుల తమ ఆందోళనతో ప్రధానిని ఏ విధంగా ఒప్పించారో.. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యనం నడపాలన్నారు.

కానీ వైసీపీ ఎందుకు స్పందించడం లేదు..? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లరు..? అని నిల‌దీశారు. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా‍ వైసీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడారా..? అని ప్ర‌శ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ఉద్యమకారులకు సంఘీభావం తెలపడానికే పవన్ కళ్యాణ్ దీక్ష అని.. ఢిల్లీకి అఖిల‌పక్షాన్ని తీసుకెళ్లాలని సీఎం జగనుకు పవన్ లేఖ రాశారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారని భావిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అవసరం లేదని కేంద్రానికి ఇప్పటికే చెప్పాం.. ఇంకా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news