ఓమిక్రాన్ విజృంభ‌ణ.. బ్రిటన్ లో 30 ఏళ్ల పై వారికి బూస్ట‌ర్ డోస్

-

ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేలా.. బ్రిట‌న్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 30 ఏళ్ల పైబ‌డిన వారి అందిరికీ బూస్ట‌ర్ డోస్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. సోమ వారం నుంచి దీని కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయ‌ని బ్రిటిన్ ప్ర‌భుత్వం తెలిపింది. కాగ కరోనా వైర‌స్ వ్యాప్తి వేగం గా ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి కే 40 ఏళ్ల పైబడిన వారికి బూస్ట‌ర్ డోసులు అందించామని తెలిపింది. కాగ ఓమిక్రాన్ వైర‌స్ ద‌క్షిణాఫ్రికా లో మొద‌లైనా.. దాదిపు అన్ని దేశాలకు వేగంగా విస్త‌రిస్తుంది.

అలాగే భార‌త్ లో కూడా ఓమిక్రాన్ అల‌జ‌డి ప్రారంభం అయింది. ఫిబ్ర‌వ‌రి.. మార్చి నెల‌లో ఓమిక్రాన్ కేసులు సంఖ్య విప‌రీతం గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. దీంతో మ‌న దేశం లో కూడా బూస్ట‌ర్ డోసులు ఇవ్వాల‌నే డిమాండ్ పెరుగుతుంది. ఇప్ప‌టి కే ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు కేర‌ళ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర వంటి రాష్ట్రా లు బూస్ట‌ర్ డోస్ కు అనుమ‌తి ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశాయి. కానీ కేంద్రం తిర‌స్క‌రిచింది. కాగ ఐసీఎంఆర్ తో బూస్ట‌ర్ డోసుకు సంబంధించి చ‌ర్చలు జ‌రుపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news