హీరోయిన్‌ స‌మంత హెల్త్ బులిటెన్ విడుద‌ల !!

-

టాలీవుడ్ హీరోయిన్‌.. సమంత ఆరోగ్య పై ఆమె.. మేనేజ‌ర్ క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌ సమంత చాలా ఆరోగ్యంగా ఉన్నారని… నిన్న కాస్తంత దగ్గు రావడం తో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఏఐజీ ఆస్పత్రి లో పరీక్షలు చేయించుకున్నార‌ని ఆమె మేనేజ‌ర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని క్లారిటీ ఇచ్చారు.

స‌మంత ఆరోగ్యం పై ఎలాంటి వదంతులు నమ్మవద్దని.. సమంత మేనేజర్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం స‌మంత ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా.. ఇవాళ ఉద‌యం నుంచి హీరోయిన్ స‌మంత ఆరోగ్యం పై వార్త‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌మంత‌.. ఏఐజీ ఆస్ప‌త్రి లో చేరింద‌ని.. ఆమె ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. జ్వ‌రం, వాంతులు ఇత‌ర ఇన్ ఫెక్ష‌న్ల తో.. బాధ‌పడుతున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఈ నేప‌ థ్యంలోనే.. స‌మంత మేనేజ‌ర్ క్లారిటీ ఇచ్చారు. సమంత ఆరోగ్యంగా ఉన్నారని ఆమె మేనేజర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news