ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్‌.. రాధే శ్యామ్ నుంచి మ‌రో సాంగ్‌..

-

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా మూవీ రాధే శ్యాం. పాన్ ఇండియా మూవీ గా తెర‌కెక్కిన ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా… యువి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింంది. సంచారీ అంటూ సాగే సాంగ్ టీజ‌ర్ ను రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ఈ మేర‌కు ప్ర‌భాస్ స్కేటింగ్ పై ఉన్న పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఈ అప్ డేట్ తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news