ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకులు అయినా icici pnb బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. ఆర్బీఐ విధించిన నిబంధనలు పాటించలేదని, తమ ఆదేశాలను ఉల్లంఘించారని ఈ రెండు బ్యాంకులకు భారీగా జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 తో పాటు సెక్షన్ -19 లోని సబ్ సెక్షన్ (2) ని ఉల్లంఘించినందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ. 1.80 కోట్ల భారీ జరిమానా విధించింది.
అలాగే ఐసిఐసిఐ బ్యాంకు కు కూడా రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఐసిఐసిఐ బ్యాంక్ వినియోగదారుల సేవింగ్స్ ఖాతా లో కనీస నిల్వలు ఉంచలేదని ఖాత దారుల నుంచి చార్జీలు వసూలు చేసిందని దీని పై ఆర్బిఐ ఆదేశాలు ఇచ్చినా వాటిని ఉల్లంఘించిందని ఆర్బీఐ ఆరోపిస్తోంది. అందుకు కారణంగా ఐసిఐసిఐ బ్యాంక్ కు 30 లక్షల రూపాయలు జరిమానా విధిస్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రెండు బ్యాంకులు షాక్ అయ్యాయి.