టీమిండియా వికెట్ కీపర్, యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. క్రికెటర్ రిషబ్ పంత్ ను ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియామకం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా.. ఉత్తరాంఖడ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. యువతను క్రీడలు, ప్రజా రోగ్యం వైపు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్ల పేర్కొన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామి.
ఇక ఉత్తరాంఖడ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన పై అటు రిషబ్ పంత్ కూడా.. హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా రిషబ్ పంత్ కు వీడియో కాల్ చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామి… మొదట రిషబ్ పంత్.. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వాకె తీసుకున్న నిర్ణయాన్ని రిషబ్ పంత్ కు వివరించారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఇక దీనిపై స్పందించిన రిషబ్ పంత్… ఉత్తరాంఖడ్ అభివృద్ధికి తోడ్పాడుతానని స్పష్టం చేశారు.