డెబిట్‌ కార్డుపై కూడా ఇన్సూరెన్స్‌ ని ఇలా తీసుకోచ్చు..!

-

బ్యాంక్ ఖాతా వున్నవారికి డెబిట్ కార్డు తప్పక ఉంటుంది. ఈ డెబిట్ కార్డు వలన చాలా లాభాలు వున్నాయి. అయితే డెబిట్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా ఉంటుంది. అది కూడా ఫ్రీగానే. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఇన్సూరెన్స్ కోసం డబ్బులు చెల్లించక్కర్లేదు. డెబిట్‌ కార్డ్‌ లేదా ఏటీఎం కార్డులకు కాంప్లిమెంటరీ వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయాన్ని ఆటోమేటిక్‌గా బ్యాంక్‌లు ఆఫర్ చేయడం జరుగుతుంది.

 

బ్యాంకులు ఆఫర్‌ చేసే వివిధ రకాల డెబిట్‌ కార్డులపై రూ. లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుంది. అయితే ప్రమాదం కారణంగా కస్టమర్‌ చనిపోతే ఈ బీమా ప్రయోజనం ఖాతాదారుని నామినీ లేదా వారసులకు వర్తిస్తుంది. 2018 ఆగస్టు 28కి ముందు జారీ అయిన రూపే కార్డులపై రూ.లక్ష, ఆ తర్వాత జారీ అయిన కార్డులపై రూ.2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.

ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY)లో భాగంగా అకౌంట్‌ తెరిచిన జన్‌ధన్‌ అకౌంట్ల రూపే డెబిట్‌ కార్డులపై కూడా ఇన్సూరెన్స్ అమలు అవుతోంది. ప్రమాద మరణానికి ముందు 90 రోజుల్లో ఖాతాదారుడు డెబిట్‌ కార్డు ద్వారా ఒక్క లావాదేవి అయిన చేసి ఉంటేనే ఈ ఉచిత ప్రమాద బీమా వర్తిస్తుంది గమనించండి.

ఒకవేళ ఖాతాదారుడు మరణించిన తర్వాత నామినీ ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన సమాచారం 60 రోజుల్లోగా క్లెయిమ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలి. అప్పుడే ఈ ప్రయోజనాన్ని పొందడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news