ఒమిక్రాన్ వ్యాప్తిపై ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం

ఇండియాలో ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి విజృంభిస్తునే ఉంది. ఇప్ప‌టికే ఇండియాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213 కు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. ఇక ఇటు దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగి పోతుంది. మొద‌ట్లో… కేసులు న‌మోదు కాన‌ప్ప‌టికీ.. క్ర‌మ క్ర‌మంగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతుంది. ఇప్ప‌టికే… దేశ రాజ‌ధాని ఢిల్లీ లో.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57 కు చేరింది.

ఈ నేప‌థ్యంలో… ఒమిక్రాన్ వ్యాప్తిపై ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీ లో క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధిస్తూ.. కేజ్రీవాల్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేసిన ఢిల్లీ స‌ర్కార్‌… క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి ఒక్క‌రూ ఈ రూల్స్ పాటించాల్సిందేన‌ని లేనిచో క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.