దళితులకు కేసీఆర్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. దళిత సాధికారతకు ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారులకు మరో అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా యూనిట్ ఏర్పాటుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఉన్న లబ్ధిదారుడు… ఈ కొద్ది నెలల కాలంలో మారిన మార్కెట్ సరళికి అనుగుణంగా యూనిట్ ను మార్చుకోవాలి అనుకుంటే ఈ మేరకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.
ఉదాహరణకు… ఇది వరకు డెయిరీ యూనిట్ ఏర్పాటు కు దరఖాస్తు చేసుకుని ఉంటే… ప్రస్తుతం మార్కెట్ కు తగ్గట్లుగా మరేదైనా యూనిట్ను ఏర్పాటు చేసు కోవాలి అనుకుంటే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి మార్చుకోవచ్చు. ఎక్కువగా డెయిరీ, ఆటో, ట్రాక్టర్ కార్ల కు సంబంధించిన ఇన్ ఇట్లా దరఖాస్తులు రావడంతో పోటీ ఎక్కువగా ఉండి వ్యాపారం సరిగా జరగదు అనే ఉద్దేశంతో యూనిట్ మార్పునకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని దళితులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.