సినీ హీరోగా మారిన తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత.. హీరోయిన్ గా ఇంద్రజ..

-

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ… ఎక్కువగా టీవీ డిబేట్ లలో కనిపిస్తారు. అయితే ఆయన రాజకీయ నాయకుడే కాకుండా సినిమా హీరో గా మారబోతున్నారు. ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారట.

ఏకంగా ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు బొమ్మకు మురళి దర్శకత్వం వహిస్తుండగా అద్దంకి దయాకర్ సరసన అలనాటి నటి ఇంద్రజ హీరోయిన్ గా నటిస్తోంది. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలు ఈ మూవీలో ఉంటాయని అద్దంకి దయాకర్ వివరించారు. ఈ మూవీని సినీ బయోపిక్ గా తీస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు అద్దంకి దయాకర్ రావు వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news