తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులు భారం పెరగడంతో భరించలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్ధిపేట్ జిల్లా మిరుదొడ్డికి చెందిన రైతు గోపయోల్ల సర్రాస్ (65) ఆత్మ హత్య చేసుకున్నాడు. సర్రాస్ కు రూ. 9 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఉన్న మూడు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, వరి పంటలను సాగు చేశాడు. కానీ దిగిబడి రాలేక పోవడంతో అప్పుల పాలు అయ్యాడు. దీంతో పొలం వద్ద ఉన్న చెట్టు కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడని పోలీసులు వివరించారు.
అలాగే నల్గండ జిల్లాలో కేతి పల్లి లో వడ్డె జానయ్య (56) కూడా అప్పులను భరించ లేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. జానయ్య నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేశాడు. అయితే సాగు చేయడానికి జానయ్య రూ. 2. 50 లక్షలను అప్పు తీసుకు వచ్చాడు. అయితే పంట నుంచి అశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం తో అప్పు ఇంకా పెరిగింది. దీంతో అప్పుల బాధ తో ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.