న్యూఢిల్లీలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోనే అత్యధికంగా 142 కేసులు దేశ రాజధానిలో నమోదుకావడం ఆందోళనలు రేకేత్తిస్తున్నది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కఠిన ఆంక్షలను విధిస్తున్నది. అంటువ్యాధుల పెరుగుదల నివారించడం కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో రూపొందించిన గ్రేడెడ్‌డ్ యాక్షన్ ప్లాన్‌ను అమలులోకి తీసుకువచ్చింది.
ఈ రోజు(సోమవారం) రాత్రి 11గంటల నుంచి న్యూఢిల్లీలో నైట్ కర్ఫ్యూ అమలులోకి రానున్నది. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు, ఎయిర్‌పోర్టు, రైల్వే, బస్ స్టేషన్స్, ఈ-కామర్స్ డెలవరీలకు మాత్రమే నైట్ కర్ఫ్యూ నుంచి వెసులుబాటు కల్పించారు. గడిచిన 24 గంటల్లో 290 కరోనా కేసులు నమోదు కావడంతో నైట్ కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ కేసుల్లో పెరుగుదల కొనసాగితే ‘ఎల్లో అలర్ట్’ను జారీ చేసే అవకాశం ఉన్నది.
ఒకవేళ ఎల్లో హెచ్చరికను జారీ చేస్తే అత్యవసరం కాని వస్తువులు, సేవలను విక్రయించే దుకాణాలు, షాపింగ్ మాల్స్‌ను సమయ వేళలను నియంత్రిస్తారు. బార్లు, రెస్టారెంట్లను పూర్తిగా మూసివేస్తారు. సుదీర్ఘ కాలం తర్వాత తెరుచుకున్న సినిమా హాళ్లు, మల్లిఫ్లెక్సులు మళ్లీ మూతపడే అవకాశం ఉంటుంది.